కోహ్లీ, పాండ్యాలకు దక్కని చోటు.. మంజ్రేకర్ టీ20 ప్రపంచకప్ జట్టు ఇదే

by Harish |
కోహ్లీ, పాండ్యాలకు దక్కని చోటు.. మంజ్రేకర్ టీ20 ప్రపంచకప్ జట్టు ఇదే
X

దిశ, స్పోర్ట్స్ : త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తన అంచనాలతో కూడిన భారత జట్టును శుక్రవారం వెల్లడించాడు. అందులో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్‌లను మంజ్రేకర్ పక్కనపెట్టడం గమనార్హం. శివమ్ దూబె, రింకూ సింగ్‌లకు కూడా అతని జట్టులో చోటు దక్కలేదు. బ్యాటింగ్ ఆర్డర్‌తో పోలిస్తే మంజ్రేకర్ తన జట్టులో బౌలర్లకు ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. గిల్‌ను కాదని యశస్వి జైశ్వాల్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేశాడు. టాప్-4లో సంజూ శాంసన్‌, సూర్యకుమార్‌‌లకు స్థానం కల్పించాడు. మెయిన్ వికెట్ కీపర్‌గా పంత్‌ను ఎంపిక చేయగా.. కేఎల్ రాహుల్‌ బ్యాకప్‌గా సెలెక్ట్ చేశాడు. ఆల్‌రౌండర్ కోటాలో జడేజాతోపాటు కృనాల్ పాండ్యాకు చోటు కల్పించిన మంజ్రేకర్.. ఐపీఎల్‌లో రాణిస్తున్న కోల్‌కతా పేసర్ హర్షిత్ రాణా, లక్నో బౌలర్ మయాంక్ యాదవ్‌లకు అవకాశం ఇచ్చాడు. కుల్దీప్-చాహల్ స్పిన్ ద్వయాన్ని రిపీట్ చేసిన మంజ్రేకర్.. పేస్ దళంలో బుమ్రా, సిరాజ్‌తోపాటు అవేశ్ ఖాన్‌ను తీసుకున్నాడు. కాగా, ఈ నెలాఖరులో బీసీసీఐ భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.

మంజ్రేకర్ ఎంపిక చేసిన భారత జట్టు :

రోహిత్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, సూర్యకుమార్, పంత్, కేఎల్ రాహుల్, జడేజా, కృనాల్ పాండ్యా, కుల్‌దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, బుమ్రా, మహ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.

Advertisement

Next Story