- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్టోబర్ 6న పాక్‌తో భారత్ ఢీ.. మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్
దిశ, స్పోర్ట్స్ : పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు సమయం దగ్గరపడుతున్నది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. ఈ ఈవెంట్ ముగిసిన మూడు నెలల వ్యవధిలోనే మరో టీ20 ప్రపంచకప్ సందడి చేయనుంది. బంగ్లాదేశ్ వేదికగా మహిళల పొట్టి ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఆదివారం రిలీజ్ చేసింది.
టోర్నీ అక్టోబర్ 3న ప్రారంభమై.. అదే 20వ తేదీన ఫైనల్‌తో ముగియనుంది. టోర్నీలో 10 జట్లు పాల్గొంటాయి. ఐదు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఏలో భారత్‌తోపాటు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ క్వాలిఫయర్ టీమ్‌లు ఉన్నాయి. గ్రూపులో బలమైన జట్లు ఉండటంతో భారత్‌కు సవాల్ తప్పదు. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తలపడటం ద్వారా టీమ్ ఇండియా టోర్నీని ఆరంభించనుంది. అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది. ఆ తర్వాత అదే నెల 9న క్వాలిఫయర్ జట్టుతో, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది.
గ్రూపు-బిలో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లతోపాటు ఓ క్వాలిఫయర్ టీమ్ భాగమయ్యాయి. ప్రతి గ్రూపు నుంచి టాప్-2 జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. అక్టోబర్ 17, 18 తేదీల్లో సెమీస్ మ్యాచ్‌లు, 20న ఫైనల్ జరగనుంది. ఈ పొట్టి ప్రపంచకప్ అన్ని మ్యాచ్‌లకు బంగ్లాదేశ్‌లోని ఢాకా, సిల్హెట్ ఆతిథ్యమివ్వనున్నాయి.