క్యూరేటరే అయోమయంలో ఉన్నాడు.. న్యూయార్క్ పిచ్‌పై రోహిత్ కామెంట్స్

by Harish |
క్యూరేటరే అయోమయంలో ఉన్నాడు.. న్యూయార్క్ పిచ్‌పై రోహిత్ కామెంట్స్
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ న్యూయార్క్ పిచ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. పిచ్ ఎలా స్పందిస్తుందో తెలియక క్యూరేటరే అయోమయంలో ఉన్నాడన్నాడు. శనివారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ మాట్లాడుతూ..‘మేము ఏ పిచ్‌పై ఆడుతున్నామో మాకే తెలియదు. క్యూరేటర్ కూడా అయోమయంలో ఉన్నాడు. ఇక, మా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి.’ అని తెలిపాడు.

పరిస్థితులు కఠినంగానే ఉన్నాయని, కానీ, జట్టులో అనుభవజ్ఞులు ఉన్నట్టు చెప్పాడు. ‘సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో పరిస్థితులను అధిగమించాం. గబ్బా టెస్టు మంచి ఉదాహరణ. ఉత్తమ ప్రదర్శన చేస్తాం. మాకు ప్రణాళికలు ఉన్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే కీలకం.’ అని తెలిపాడు. అలాగే, ఐర్లాండ్‌పై విరాట్ నిరాశపర్చడంపై రోహిత్ మాట్లాడుతూ.. కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. అతని అనుభవంపై తమకు నమ్మకం ఉందన్నాడు. అలాగే, 3వ స్థానంతో పంత్ బ్యాటింగ్‌ రావడంపై స్పందిస్తూ.. అతని ఎటాకింగ్ గేమ్ తమకు ఉపయోగపడుతుందని చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed