- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంచలన నిర్ణయం తీసుకున్న బెన్ స్టోక్స్
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ నుంచి తాను తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు. ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మంగళవారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. పొట్టి ప్రపంచకప్ జట్టు ఎంపికకు తన పరిగణలోలేనని, బౌలింగ్ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్టోక్స్ తెలిపాడు.
‘అన్ని ఫార్మాట్లలో పూర్తి ఆల్‌రౌండర్‌గా నా పాత్ర నిర్వర్తించడానికి కష్టపడుతున్నాను. నా బౌలింగ్ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాను. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్‌ను తప్పుకోవడం త్యాగంగా భావిస్తున్నా. ఈ నిర్ణయం భవిష్యత్తులో ఆల్‌రౌండర్‌గా నా పాత్ర పోషించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. వరల్డ్ కప్ టైటిల్ నిలబెట్టుకోవడంలో బట్లర్, మాథ్యూ మోట్(వైట్ బాల్ కోచ్), టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు.’ అని స్టోక్స్ పేర్కొన్నాడు. ఇటీవల భారత్ పర్యటనలో తాను బౌలింగ్ విషయంలో ఎంత వెనుకడి ఉన్నానో తెలిసిందని, టెస్టు సమ్మర్ ప్రారంభానికి ముందు కౌంటీ చాంపియన్‌షిప్‌లో డర్హామ్ తరపున ఆడేందుకు ఎదురుచూస్తున్నాని తెలిపాడు.
కాగా, కొంతకాలంగా స్టోక్స్ దీర్ఘకాలిక గాయాలతో ఇబ్బందిపడుతున్నాడు. ఐపీఎల్ గత సీజన్‌లో ఫిట్‌నెస్ సమస్యలతో చెన్నయ్ తరపున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను.. ఈ సీజన్‌కు అందుబాటులో లేడు. ఇటీవల టీమ్ ఇండియాతో టెస్టు సిరీస్‌లోనూ స్టోక్స్ ఎక్కువగా బౌలింగ్ చేయలేదు. చివరి టెస్టులో బౌలింగ్ చేసిన అతను 5 ఓవర్లు మాత్రమే చేశాడు.
ఇంగ్లాండ్ టీ20 వరల్డ్ కప్-2022 టైటిల్ గెలవడంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌లో అతను అజేయ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. ఇంగ్లాండ్ జట్టు జూన్ 4న స్కాట్లాండ్‌తో ఆడటం ద్వారా టోర్నీని ఆరంభించనుంది.