T20WorldCup: శ్రీలంక‌పై 2 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విక్టరీ

by Ramesh N |
T20WorldCup: శ్రీలంక‌పై 2 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విక్టరీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ 2024లో పెద్ద జట్లకు చిన్న టీమ్స్ చుక్కలు చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ మరో విజయం నమోదైంది. శ్రీలంక జట్టును బంగ్లాదేశ్ టీమ్ ఓడించింది. ఇవాళ డ‌ల్లాస్‌లో గ్రూప్ డీలో జ‌రిగిన మ్యాచ్‌లో శ్రీలంక‌పై 2 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విక్ట‌రీ సాధించింది. మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్ల న‌ష్టానికి గాను 124 స్కోర్ మాత్రమే చేసింది. శ్రీలంకలో పథుమ్‌ నిస్సంకా 47 పరుగులు చేయగా.. మిగతా వారంతా దారుణంగా ఫెయిల్ అయ్యారు.

తర్వాత బ‌రిలోకి దిగిన బంగ్లాదేశ్ లంక‌బౌలర్ల చేతిలో విలవిల లాడింది. టార్గెట్ తక్కువగా ఉండటంతో అతిక‌ష్టం మీద బంగ్లాదేశ్ మ్యాచ్‌ను నెగ్గింది. ఇక, లిట్టన్ దాస్ 36, తౌహీద్ 40, మహ్మదుల్లా 13 బంతుల్లో 16 పరుగులు చేసి జట్టుకు విజయానికి కృషి చేశారు. 19 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగుల స్వల్ప టార్గెట్‌ను బంగ్లాదేశ్ చేదించింది.

Advertisement

Next Story