టీ20 వరల్డ్ కప్‌కు రెండు బ్యాచ్‌లుగా భారత ఆటగాళ్లు.. మొదట వెళ్లేది వాళ్లే

by Harish |
BCCI Announces Team India Squads For England T20 & ODI
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ సందడి ముగియగానే టీ20 వరల్డ్ కప్‌ సంబరం మొదలుకానుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తుండగా.. జూన్ 1 నుంచి టోర్నీ ప్రారంభకానుంది. ఈ టోర్నీకి నేడో, రేపో బీసీసీఐ భారత జట్టును ప్రకటించనుంది. ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తొలి మ్యాచ్‌లో జూన్ 5న నూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో ఆడనుంది.

ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో న్యూయార్క్‌కు భారత ఆటగాళ్లను రెండు బ్యాచ్‌లుగా పంపించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మే 26న ఐపీఎల్ ఫైనల్‌ జరగనుంది. ఐపీఎల్ ఫైనల్‌కు, వరల్డ్ కప్ ప్రారంభానికి మధ్య వ్యవధి తక్కువగా ఉంది. అమెరికా వాతావరణానికి అలవాటు పడటం, ప్రపంచకప్‌కు సన్నద్ధమవడానికి భారత ఆటగాళ్లకు సమయం సరిపోదని ఆలోచించిన బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన జట్ల ఆటగాళ్లు మే 21న తొలి బ్యాచ్‌లో భాగంగా న్యూయార్క్‌కు వెళ్లనున్నారు. దీంతో ముందుగానే వారు ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యే వీలు ఉంటుంది. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాతి రోజు అంటే మే 27న మిగతా ఆటగాళ్లు నూయ్యార్క్‌కు వెళ్లనున్నారు.

Advertisement

Next Story