- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Youth Addicted to Ganja:గంజాయి మత్తులో యువత
దిశ, సత్తెనపల్లి:ఒక్క దమ్ము గాల్లో తేలుస్తోంది. ఒక్క సిగరెట్ ఫుల్ కిక్కు ఇస్తుంది. ఈ అలవాటుతోనే యువత మత్తు లోయలో పడిపోతుంది. పక్కదారి పట్టి నిషా మైకంలో తెలిసిపోతుంది. యూత్ నే టార్గెట్ గా అక్రమార్కులు గంజాయి ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు. రూ.200కే రేటు పెట్టి మత్తులోకి దింపుతున్నారు. దీంతో మజా కోసం యువత అడ్డదారుల్లో ఎంజాయ్ కోసం గంజాయిని ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రమాదకరమైన డేంజర్ ఇప్పుడు పల్నాడులో కొత్త పుంతలు తొక్కుతోంది. గంజాయి పై కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. దీంతో వరుసగా పోలీసులు చేస్తున్న దాడులతో గంజాయి మాఫియా డొంకలు కదులుతున్నాయి.
అయితే ఈ దాడుల్లో బయటకు వస్తున్న నిజాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న పిడుగురాళ్లలో గంజాయి స్మగ్లర్ బత్తుల శేఖర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేజీ గంజాయిని రూ. 3వేలకు మురికిపూడి ప్రదీప్ చంద్రకు ఇచ్చినట్లుగా పోలీసుల విచారణలో చెప్పాడు. చంద్ర గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ప్యాకెట్ రూ.200 అమ్ముతున్నట్లుగా విచారణలో పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి 1080 గ్రాముల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇటివల అమరావతి మండలం దిగుడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అలాగే క్రోసూరు మండలం హసానాబాద్‌లో గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళ నుంచి 300 గ్రాములు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అమరావతి అచ్చంపేట క్రోసూరు మండలాల్లో ఎక్కువ మంది యువత గంజాయి మత్తుకు బానిస అవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే చదువుల పేరుతో రోడ్లపైకి వస్తున్న యువత విచ్చలవిడిగా గంజాయిని పీల్చేస్తున్నారు. చదువులు కోలువులు మధ్య క్రాస్ రోడ్డులో ఆశాజీవులుగా పరిగెత్తే యంగ్ జనరేషన్ రాంగ్ రూట్ లో మత్తుకు దగ్గరవుతున్నారు. గంజాయి నిషా మత్తుకు అలవాటు పడుతున్నా పిల్లల తీరుతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయి సరఫరా పూర్తిగా అరికట్టాలని కోరుతున్నారు.