ఒకే రాత్రి అంతా చుట్టేశారు

by Sridhar Babu |
ఒకే రాత్రి అంతా చుట్టేశారు
X

దిశ, కరీంనగర్ టౌన్ : కరీంనగర్ రూరల్ మండలంలోని దూర్శేడ్, మొగదుంపూర్ గ్రామాల్లో పలు చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. వివరాల్లోకి వెళితే దూర్శేడ్ లో కొంత కాలంగా అద్దెకు ఉంటున్న ఇరుకుళ్ల గ్రామానికి చెందిన బలుసుల సంపత్ తాను ఉంటున్న ఇంటిముందు ఆటోను పార్కింగ్ చేసి వెళ్లాడు. ఉదయం లేచి చూసేసరికి ఆటో లేకపోవడంతో సంపత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది ఇలా ఉండగా ముగ్గంపూర్ వైన్స్ లో చొరబడ్డ దుండగులు సుమారు 40 వేల రూపాయల విలువగల మద్యం, 20వేల రూపాయల నగదు దొంగిలించారు. దొంగిలించిన వ్యక్తులు యువకులుగా సీసీ ఫుటేజ్ లో రికార్డు అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story