HYD: ప్రజాభవన్ సమీపంలో అనూహ్య ఘటన

by Gantepaka Srikanth |
HYD: ప్రజాభవన్ సమీపంలో అనూహ్య ఘటన
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌ సమీపంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం భవనం సమీపంలోని పెట్రోల్ బంక్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భూగర్భ ట్యాంక్ మూత తీస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన స్థానికులు భయాందోళనతో అక్కడినుంచి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story