ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం.. ఒకరికి సీరియస్

by GSrikanth |
ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం.. ఒకరికి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ బైకర్‌.. సైకిల్‌ను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద హైవేపై శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదంలో సైకిల్‌పై వెళ్తున్న వెంకట్(43), బైక్‌పై వెళ్తున్న నిఖిల్ రెడ్డి(25) మృతిచెందినట్లు గుర్తించారు. బైకుపై వెనకాల కూర్చున్న సుమంత్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story