- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Crime News:నగలు దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్ ..65 తులాల బంగారం స్వాధీనం
దిశ, కడప:వైఎస్ఆర్ జిల్లా వేంపల్లె పంచాయతీ పరిధిలోని బండల ఉత్తన్న వీధిలో జరిగిన దొంగతనం కేసులో నిందితులైన షేక్ జాఫర్ (బాలల), సయ్యద్ సాదక్ అనే ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ 4,80,000 లక్షల విలువ చేసే 65 తులాల బంగారు నగలను స్వాధీన పరుచుకున్నట్టు పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. ఆదివారం వేంపల్లె పోలీసు స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేంపల్లెలోని బండల ఉత్తన్న వీధిలో సయ్యద్ నూర్జహాన్ నివాసం ఉన్నట్లు చెప్పారు. నూర్జహాన్ చిన్న కుమారుడు, కోడలు ఇరువురు సౌదియా అరేబియాకు పోతూ బంగారు, వెండి నగలను భద్రపరచమని ఇవ్వడం జరిగినట్లు తెలిపారు.
దీంతో నూర్జహాన్ తన కుమారుడు ఇచ్చిన బంగారు, వెండి నగలను ఇంట్లోని బీరువాలో పెట్టి జూన్ 19వ తేదిన కడపలో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. తిరిగి కడప నుండి జూలై 26వ తేది మధ్యాహ్నం 3గంటలకు ఇంటికి వచ్చి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి గేటు పగుల గొట్టి, ఇంటిలో ఉన్న బీరువాను కూడ పగులగొట్టి బీరువాలోని బంగారు, వెండి నగలను దొంగలించినట్లు నూర్జహాన్ పోలీసులకు పిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇంటికి బీగాలు వేసి ఉన్న విషయాన్ని బిడ్డాలమిట్టకు చెందిన బెల్దారు పని చేస్తున్న జాఫర్, సయ్యద్ సాదక్ అనే ఇద్దరు గమనించి దొంగతనం చేసి బీరువాలో ఉన్న బంగారు, వెండి నగలను దోచుకెళ్లినట్లు చెప్పారు.
బెల్దారు పనికి పోతూ వచ్చిన డబ్బులు జల్సాలకు సరిపోక పోవడంతో దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇంటికి బీగాలు వేసిన ఇంటిలోకి జూన్ 28న దొంగతనం చేసినట్లు చెప్పారు. నూర్జహాన్ ఇంటిలో ఉన్న బంగారం, వెండి నగలను తీసుకుని ఎద్దుల కొండ వద్ద పీడ రాతి బండ కింద పెట్టడం జరిగింది అన్నారు. ఆదివారం ప్రోద్దుటూరుకు వెళ్లి అమ్ముకొని రావాలనే ఉద్దేశంతో సయ్యద్ సాదక్, షేక్ జాఫర్ అనే ఇద్దరు కలిసి దాచి పెట్టిన బంగారు, వెండి నగలను హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని వస్తుండగా అలిరెడ్డిపల్లె రహదారిలోని పాపాఘ్ని నది బ్రిడ్జి వద్ద అనుమానం గా ఉన్న ఇద్దరిని పోలీసులు ఇద్దరిని పట్టుకొని సోదా చేశారు.
దీంతో బంగారు, వెండి నగలు బయట పడ్డాయి. ఇద్దరిని విచారించగా నూర్జహాన్ ఇంటిలో చోరికి చేసిన విషయం బయట పడినట్లు చెప్పారు. చోరి చేసిన ఇద్దరిని రిమాండ్ కు పంపినట్లు చెప్పారు. చోరికి పాల్పడిన నిందితుల నుండి దాదాపు రూ 480000 విలువ చేసే దాదాపు 65 తులాల బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చోరి కేసును తొందరగా ఛేదించేందుకు సిఐ చాంద్ బాషాను కానిస్టేబుళ్లను డీఎస్పీ వినోద్ కుమార్ అభినందించారు.