అరేబియా సముద్రంలో విషాదం: పడవ బోల్తా పడి 12 మంది పాక్ జాలర్లు మృతి!

by samatah |
అరేబియా సముద్రంలో విషాదం: పడవ బోల్తా పడి 12 మంది పాక్ జాలర్లు మృతి!
X

దిశ, నేషనల్ బ్యూరో: అరేబియా సముద్రంలో విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి 12మంది పాకిస్థానీ జాలర్లు మృతి చెందారు. ఈ విషయాన్ని బుధవారం పాక్ మిలటరీ అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్‌లోని దక్షిణ నగరమైన కరాచీలోని ఇబ్రహీం హైదరీ ప్రాంతానికి చెందిన 45 మంది మత్స్యకారులు ఈనెల 5న అస్సాద్ అనే ఓడలో చేపల వేటకు బయలుదేరారు. ఈ క్రమంలోనే వారు ప్రయాణిస్తున్న ఓడ బోల్తా పడిందని..వెంటనే సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ క్రమంలో 12 మంది మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. తప్పిపోయిన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రతికూల పరిస్థితుల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, పాకిస్థాన్‌లో ఘోరమైన రవాణా ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతంటాయి. ఎందుకంటే ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉండగా..భద్రతా చర్యలు అంతంత మాత్రంగానే ఉంటాయని తెలుస్తోంది. అంతేగాక ఓడలు తరచుగా ఓవర్ లోడ్‌తో ఉంటాయని, అందువల్ల బోల్తా పడే అవకావం ఎక్కవుగా ఉంటుంది.

Advertisement

Next Story