కామారెడ్డి జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం

by Shiva |
కామారెడ్డి జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం
X

దిశ, తాడ్వాయి: రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం పాలైన ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో తాళ్లపల్లి శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి డ్యూటీలో భాగంగా కామారెడ్డి నుంచి తాడ్వాయి పోలీస్ స్టేషన్‌కు కారులో వెళ్తుండగా రోడ్డు ప్రక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌కు తలకు బలంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ తల, ఛాతి భాగంలో బలమైన గాయాలు అవ్వడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుది శ్వాస విడిచాడు. మృతుడు శ్రీనివాస్‌ భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

Next Story