బైక్‌ను వెనుకనుంచి ఢీకొట్టిన లారీ.. ముగ్గురు స్పాట్ డెడ్

by GSrikanth |
బైక్‌ను వెనుకనుంచి ఢీకొట్టిన లారీ.. ముగ్గురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్:‌ ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూకుసుకొచ్చిన ఓ లారీ ముందు వెళుతున్న బైకును వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులు దుప్పితూరుకు చెందినవారిగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story