దారుణం.. ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో మూడు కాలిపోయిన మృతదేహాలు లభ్యం

by Mahesh |
దారుణం.. ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో మూడు కాలిపోయిన మృతదేహాలు లభ్యం
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని కడూరులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా ఒక్కో గదిలో ఒక్కో మృతదేహం చొప్పున ముగ్గురు మంటల కారణంగా కాలిపోయిన స్థితిలో కనిపించారు. దీంతో పోలీసులు ఆ ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించగా.. హత్య చేసి తగులబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలు ఎవరు, ఎందుకు చేశారో అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా ఘటనలో చనిపోయిన వారిని సుదన్ కుమార్, అతని తల్లి, కుమారుడిగా పోలీసులు గుర్తించారు. సుదన్ కుమార్ హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడని తెలిపారు.

Advertisement

Next Story