- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
transporting ganja : గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్టు
దిశ, మధిర : గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. రెండున్నర కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మధిర సీఐ డి.మధు వివరాలు వెల్లడించారు. స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధిర పట్టణానికి చెందిన కళ్యాణపు వంశీ , తమ్మిసెట్టి కిరణ్ , రెంటపల్లి మహేష్ ఆనంద్ అనే యువకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుండి మధిర కు నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు మధిర పట్టణ ఎస్సై ఎన్. సంధ్య శుక్రవారం సాయంత్రం మధిర - రాయపట్నం వైరా నది బ్రిడ్జిపై రెవెన్యూ అధికారులు ,
పోలీస్ సిబ్బందితో కలిసి సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారని తెలిపారు. ఆ ముగ్గురు యువకులు హోండా పై నందిగామ నుండి మధిర బ్రిడ్జి సమీపంలోకి చేరుకున్నారని, ఎస్సై ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా వారి వద్ద బ్లూ రంగు బ్యాగ్ ఉండడాన్ని గమనించారని తెలిపారు. దాంలో ఏముందని ప్రశ్నించగా వారు ముగ్గురు సమాధానం చెప్పలేక తడబడుతూ , భయాందోళనలకు గురయ్యారు అని అనుమానంతో బ్యాగును ఓపెన్ చేయగా రెండు పెద్ద ప్యాకెట్లు , ఒక చిన్న ప్యాకెట్ ప్లాస్టర్ తో సీల్ చేసి ఉన్న రెండున్నర కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారని వివరించారు. మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న కారణంగా వారిపై కేసు నమోదు చేసి శనివారం రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు. గంజాయిని అరికట్టేందుకు కృషి చేసిన పట్టణ ఎస్ఐ ఎన్.సంధ్య ను పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు.