అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం..ముగ్గురు అరెస్ట్

by Jakkula Mamatha |
అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం..ముగ్గురు అరెస్ట్
X

దిశ ప్రతినిధి,అనంతపురం: కర్ణాటక మద్యం అక్రమంగా తరలించి అధిక ధరలతో సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.రాప్తాడు సీఐ మునిస్వామి తో కలిసి మీడియాకు అనంతపురం రూరల్ డీఎస్పీ బి.వి.శివారెడ్డి వివరాలు వెల్లడించారు.ఎగువపల్లి నుంచి కర్ణాటక మద్యం కొనుగోలు చేసి రాప్తాడు మండలం పాలచెర్లకు అక్రమంగా బొలెరోలో తరలిస్తున్నారు. ఈ సమాచారం పక్కాగా అందుకుని అనంతపురం రూరల్ డీఎస్పీ బి.వి శివారెడ్డి పర్యవేక్షణలో రాప్తాడు సీఐ మునిస్వామి, ఆయన సిబ్బంది బృందంగా వెళ్లి సోమవారం ఉదయం పాలచెర్ల సమీపంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి 1248 కర్ణాటక టెట్రా ప్యాకెట్లు (13 బాక్సులు), బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story