పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో దొంగతనం ...

by Aamani |
పోలీస్‌స్టేషన్‌కు  కూతవేటు దూరంలో దొంగతనం ...
X

దిశ, కోదాడ : నిత్యం రద్దీగా ఉండే కోదాడ బస్టాండ్, బస్టాండ్ పక్కనే ఉన్న విలాస్ బేకరీలో మంగళవారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి బేకరీ లోకి చొరబడిరూ. 5000 ల నగదు చోరీ చేశారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఈ దొంగతనం జరగడం గమనార్హం. రోజు మాదిరిగానే బేకరీ బంద్ చేసుకొని మంగళవారం బేకరీ యజమానులు సిబ్బంది ఇంటికి వెళ్లారు తిరిగి బుధవారం ఉదయం షాపు తెరిచి చూసేసరికే వస్తువులు ఎక్కడికక్కడే చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన షాప్ నిర్వాహకులు కౌంటర్ తెరిచి చూడగా కౌంటర్లో నగదు కనిపించలేదు. జరిగిన దొంగతనంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దొంగతనం చేసే విధానం సీసీ కెమెరాలు రికార్డు అయింది. కానీ తెలివిగా దొంగ కెమెరా లో తన ముఖం కనబడకుండా పూర్తిగా కవర్ చేశారు. సంఘటన స్థలానికి పట్టణ ఎస్సై రంజిత్ రెడ్డి వెళ్లి పరిశీలించారు.

Advertisement

Next Story

Most Viewed