- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పనిచేస్తున్న సంస్థకే కన్నం
దిశ,హిమాయత్ నగర్ : ప్రియురాలి మోజు పడి పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆదివారం నారాయణగూడ లో పోలీస్ స్టేషన్ లో కేసుకు సంబంధించిన వివరాలను సీఐ చంద్రశేఖర్, డీఎస్ఐ వెంకటేష్ తో కలిసి ఈస్ట్ జోన్, సుల్తాన్ బజార్ డివిజన్ ఏసీపీ శంకర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. బషీర్బాగ్ చందానగర్ చెందిన సాయి లక్ష్మణ్ ఇతను ఎనిమిదేళ్లుగా శ్రీ సిద్ధి వినాయక జ్యువెలరీ & ఎక్సపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో స్టాక్ ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు నెలలుగా డ్యూటీ కి రాకపోవడంతో అనుమానం వచ్చి యజమాని ఆడిట్ నిర్వహించారు.
ఆడిట్ లో 280 గ్రాములు మిస్సింగ్ అయినట్లు తేలింది. దీంతో బాధితులు నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయి లక్ష్మణ్ విచారించగా తానే దొంగిలించానని విచారణలో వెల్లడించాడు. నిందితుడి నుంచి మూడు తులాల బంగారంతో పాటు మాణప్పురంలో తాకట్టు పెట్టిన డైమండ్ నెక్లెస్ ని రికవరీ చేసినట్లు ఏసీపీ శంకర్ వెల్లడించారు. త్వరగా కేసును చేదించిన నారాయణగూడ డీఎస్ఐ వెంకటేష్, అభిలాష్, అరుణ్ కుమార్, సురేష్, సంతోష్ చారి, విష్ణుమూర్తి లను ఏసీపీ అభినందించారు.