అనుమానాస్ప‌ద స్థితిలో యువ‌తి మృతదేహం ల‌భ్యం

by Sridhar Babu |
అనుమానాస్ప‌ద స్థితిలో యువ‌తి మృతదేహం ల‌భ్యం
X

దిశ, గండిపేట్‌ : అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతదేహం లభ్యమైన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై మురళీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. నెమలి ఫామ్ హౌస్ సమీపంలోని గండిపేట్ చెరువులో ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఘ‌ట‌నా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మృతి చెందిన మహిళ వయస్సు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండి ఉండవచ్చని, మెరూన్ కలర్ టాప్, క్రీమ్ కలర్ లెగ్గిన్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా తాయత్తు ధరించి ఉందని పోలీసులు వివరించారు. మహిళా సుమారు 15 రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Advertisement

Next Story