కారు బోల్తా పడి కుటుంబ సభ్యులందరికీ గాయాలు

by Sridhar Babu |
కారు బోల్తా పడి కుటుంబ సభ్యులందరికీ గాయాలు
X

దిశ, నేరడిగొండ : నేరడిగొండ మండలంలోని గుత్పల గ్రామ సమీపంలో అదుపు తప్పి కారు బోల్తా పడడంతో ఒకే కుటుంబానికి చెందిన భార్యభర్తతో పాటు ఇద్దరు కుమారులకు గాయలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రైల్వే ఉద్యోగి కుమార్ తన కుటుంబ సభ్యులతో సిద్దిపేట నుండి ఆదిలాబాద్ కి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు నేరడిగొండ

మండలంలోని గుత్పల గ్రామ సమీపాన జాతీయ రహదారి 44 పై అదుపుతప్పి బోల్తా పడడంతో ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ఉద్యోగి కుమార్ తో పాటు ఆయన భార్య పద్మ, కుమారులు విశ్వక్, ధృవ్ గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను ఓ ప్రైవేట్ వాహనంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story