నచ్చని పెళ్లి చేసుకున్నాడని దారుణానికి తెగించిన అన్న

by Nagaya |
నచ్చని పెళ్లి చేసుకున్నాడని దారుణానికి తెగించిన అన్న
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఇష్టం లేని పిల్లను పెళ్లి చేసుకున్నాడని తమ్ముడిని ఏమి చేయలేక అతడు పెళ్లి చేసుకున్న కుటుంబ సభ్యుల ఇంటికి నిప్పు పెట్టాడు ఓ అన్న. పెళ్లిని అడ్డుకునేందుకు అన్న మత పెద్దలను బెదిరించినా చివరకు తమ్ముడు మాత్రం తాను ఏడాది క్రితం నిశ్చితార్థం చేసుకున్న యువతినే పెళ్లి చేసుకున్నాడు. దానిని భరించలేని అన్న యువతీ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న వధువు అమ్మమ్మ ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

శాంతినగర్‌కు చెందిన అమర్, మజహర్ అన్నదమ్ములు. వీరిద్దరి కంటే మరో ఇద్దరు పెద్దవారు ఉన్నారు. ప్లంబర్ పనిచేసే అమర్‌కు ఏడాది క్రితం హైదరాబాద్‌కు చెందిన యువతీతో నిశ్చితార్థం జరిగింది. పేదింటి యువతీ అయినప్పటికీ ఆమెనే పెళ్లి చేసుకుంటానని అమర్ భీష్ముంచుకు కూర్చున్నాడు. ఏడాదికాలంగా అమర్‌ను పెళ్లి చేసుకోకుండా మజహర్ అడ్డుకుంటున్నాడు. శుక్రవారం అమర్ తనతో నిశ్చితార్థం జరిగిన యువతీని ఎడపల్లిలో కాజీ వద్ద వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన మజాహార్ అతని అనుచరులు నవదంపతులపై దాడికి యత్నించారు. అనంతరం వారిద్దరు రక్షణగా ఉంటుందని శాంతినగర్‌లో ఉంటున్న యువతి అమ్మమ్మ ఇంటి వద్ద ఉన్నారు.

ఈ విషయం తెలుసుకున్న మజహర్ అతని అనుచరులు యువతి అమ్మమ్మ మౌలి బేగం ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అమర్ అతని పెళ్లి చేసుకున్న యువతి పక్క గదిలో ఉండడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో పెళ్లి కోసం ఇచ్చిన కట్న కానుకలు బంగారం కాలీ బూడిద అయ్యాయి. బాధితులు స్థానిక ఐదో టౌన్ పోలీసులకు, అజ్ఞాపక శాఖ సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.

Advertisement

Next Story

Most Viewed