Accident : ట్యాంకర్​, బస్సు ఢీ...డ్రైవర్ మృతి..

by Sridhar Babu |
Accident : ట్యాంకర్​, బస్సు ఢీ...డ్రైవర్ మృతి..
X

దిశ, గంగాధర : కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి గంగాధర మండలం కొండన్నపల్లె శివారు ప్రాంతంలో ఆర్టీసీ బస్సు, ట్యాంకర్ లారీ ఢీకొనడంతో ట్యాంకర్ డ్రైవర్ మృతి చెందినట్లు సమాచారం. గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు...బూరుగుపల్లి నుండి గంగాధర కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొండన్నపల్లి సమీపంలోకి చేరుకోగా కరీంనగర్ నుండి జగిత్యాల వైపు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ ఢీకొనడంతో ట్యాంకర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story