Superstitious beliefs: ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. మూఢ నమ్మకంతో ఓ నిండు ప్రాణం బలి

by Shiva |
Superstitious beliefs: ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. మూఢ నమ్మకంతో ఓ నిండు ప్రాణం బలి
X

దిశ, వెబ్‌డెస్క్: సైన్స్, టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తున్నా గ్రామాల్లో మాత్రం పరిస్థితులు ఏ మాత్రం మారడం లేదు. మూఢ నమ్మకాలను విశ్వసిస్తూ అజ్ఞానంతో ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా, ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల పరిధిలోని న్యూ సోమార్‌పేట్ గ్రామంలో సిడాం లక్ష్మి(26)కి నెలసరి అయింది. అయితే, ఆదివాసి ఆచారం ప్రకారం.. అమ్మాయికి నెలసరి వస్తే కుప్పిలో పడుకోబెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే లక్ష్మి కూడా ఇంటి బయటకు కుప్పిలో పడుకుంది. అయితే, నిద్ర మత్తులో ఉన్న ఆమెను పాము కాటేసింది. ఆ విషయంలో నిద్రలో ఉన్న లక్ష్మి పట్టించుకోకపోవడంతో ఉదయం లేచి చూసేసరికి తీవ్రమైన నొప్పితో కాలు వాయడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఒళ్లంతా లక్ష్మి శరీరం మొత్తం విషం పాకడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

Advertisement

Next Story