- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవత అంటూ 20 ఏళ్లుగా పాముకు పూజలు.. ఇంట్లో ఒక్కతే ఉండగా నిజరూపాన్ని చూపెట్టిన స్నేక్
దిశ,వెబ్‌డెస్క్ : జంతు ప్రేమికులు మన సమాజంలో చాలామంది ఉన్నారు. వారు పెంచుకుంటున్న జంతువులను కొందరు దైవంగా కూడా భావిస్తుంటారు. ఉదాహారణకు కుక్కను బైరవుడిగా, పాముని నాగ దేవతగా కొలుస్తుంటారు. కుక్క విశ్వాసం కలదని, పాముకు పాలు పోసి పెంచిన అది విశ్వాసం మరిచి యజమానినే కాటేస్తుందని మనకు ఎన్నో ఉదాహారణలు ఉన్నాయి. ఇదే నిజం అంటూ నిర్మల్ జిల్లాలో ఒక పాము నిరూపించింది.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామంలో అలుగుల గంగవ్వ(65) ముప్పై ఏళ్లకు పైగా అంగన్‌వాడీలో ఆయాగా విధులు నిర్వహించింది. ఈ మధ్యన్నే గంగవ్వ ఉద్యోగ విరమణ పొందింది. ఈమెకు కుమారుడు రాజలింగు, కుమార్తె పద్మ ఉన్నారు. గంగవ్వ ఇంట్లో పుట్ట ఉంది. ఆ పుట్టలో ఉన్న పాముకు రోజూ పాలు పోస్తూ 20 ఏళ్లుగా నిత్యం పూజలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆమె ఇంట్లో మట్టి నేలను అలుకుతుండగా ఆకస్మాత్తుగా పుట్టలో నుంచి బయటకు వచ్చిన నాగుపాము చేతిపై పలుమార్లు కాటు వేసింది. పదే పదే పాము కాటేయడంతో అనుమానం వచ్చిన గంగవ్వ కళ్లు తిరుగుతున్నాయంటూ చుట్టు పక్కల వాళ్లకు సమాచారం ఇచ్చింది. నాటువైద్యం కోసం లింగాపూర్కి తీసుకెళ్లగా పరిస్థితి విషమించిందని వైద్యం చేయడానికి నిరాకరించారు. దీంతో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. స్థానికులు ఆ పుట్టపై వలను కప్పి పామును బంధించారు. మరుసటి రోజు కుటుంబ సభ్యుల కోరిక మేరకు పామును సమీపంలో అడవిలో విడిచారు.