- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమా తరహాలో స్మగ్లింగ్.. 170 కేజీల గంజాయి పట్టివేత
దిశ, కార్వాన్: హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట్ ప్రాంతంలో ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి అక్రమంగా తరలిస్తున్నారు. ఆ వాహనాన్ని స్టేట్ టాస్క్ ఫోర్స్ బీ టీం తుల శ్రీనివాసరావు బృందం పట్టుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ వెల్లడించారు. ఒడిశా కొరాపూర్ జిల్లా అనే గ్రామానికి చెందినటువంటి ఇస్మాయిల్ తురికి అనే వ్యక్తి ఫోక్లైన్ ఆపరేటర్‌గా చత్తీస్‌గడ్ రాయపూర్ ప్రాంతంలో ఒక విద్యుత్ సరఫరా సంస్థలో పనిచేస్తూ.. ఒడిశాకు చెందిన సంతోష్ అనే వ్యక్తితో సంబంధాలు ఏర్పరచుకొని గంజాయి అమ్మకాలకు జరిపేవాడు. పలుమార్లు గంజాయి అక్రమ రవాణా చేస్తూ.. మధ్యప్రదేశ్‌లోని మాండ్ల అనే ప్రాంతంలో పట్టుబడి 11 నెలల పాటు జైలుశిక్ష కూడా అనుభవించాడు.
ఈ క్రమంలో ఒడిశా కోరాపుట్‌తురుకి చెందిన ఇస్మాయిల్, మహారాష్ట్ర పూణే ఇందాపూర్ చెందిన మహమ్మద్ ఆసీస్, రాజన్. పోనీ హిందీ ఇందాపూర్ చెందిన శైలేంద్ర కారత్ ఇలియాస్ బంటి, సోలాపూర్ జిల్లా కర్మాన తాలూకా చికాతన్ గ్రామానికి చెందిన జీవన్ నానా నికిత్. ఇందాపూర్ కు చెందినటువంటి కేవల్ వినయ్ ముకురే, ఒడిశా మల్కాన్‌గిరి లక్ష్మీనారాయణ భారీఖ్. మల్కాన్‌గిరి జిల్లా మతిని గ్రామానికి చెందిన ధర్మరాజు దొర, అమర్‌లు ఎనిమిది మంది కలిసి ఒక ముఠాగా ఏర్పడి వివిధ ప్రాంతాలకు గంజాయి సరఫరా చేశారు.
ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని సరఫరా చేయడం కోసం ఒక వ్యాన్‌లో మధ్యలో ఏర్పాటు చేసినటువంటి అరల్లో గంజాయి పాకెట్లను తరలించేందుకు సిద్ధం అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యాను పైన ఉన్నటువంటి రేకులను తొలగించడంతో అందులో 170 కిలోల గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. కాగా దాడిలో అడిషనల్ ఎస్పీ భాస్కర్, డీఎస్పీలు తుల శ్రీనివాస రావు, తిరుపతి యాదవ్, ఎస్‌టిఎఫ్ సిఐ లు వెంకటేశ్వర్లు, నాగరాజు, ఎస్ఐ శివ కృష్ణ, కానిస్టేబుల్ వేణు, శివప్రసాద్, మౌలాలి, భరత్, చంద్ర, దినేష్, కార్తీక్, లోకేష్ లు పాల్గొన్నారు.