- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కానుకల కోసం అన్నను పెళ్లి చేసుకున్న చెల్లి.. సీఎం యోగి సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: పేద కుటుంబాలకు ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు ఆర్థికసాయంతోపాటు బంగారాన్ని కానుకగా ఇస్తున్నాయి. ఈ పథకం పేదలకు వరంగా మారినప్పటికీ కొంతమంది అక్రమార్కులకు కల్ప తరువుగా మారింది. నకిలీ మ్యారేజ్ సర్టిఫికేట్లు, ఉత్తుత్తి పెళ్లీలు, పేర్లు మార్చుకోని డబుల్ వివాహాలు చేసుకుంటూ ప్రభుత్వ పథకాలను కాజేస్తున్నారు. ఇదే మాదిరిగా ఓ యువతి ప్రభుత్వ కానుకలకు ఆశపడి సొంత అన్ననే పెళ్లి చేసుకోని నీచానికి పాల్పడింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది.
మార్చి 5న మహారాజ్‌గంజ్ జిల్లాలోని లక్ష్మీపుర్ బ్లాక్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ 38 నిరుపేద కుటుంబాలకు చెందిన జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. వారందరికీ ‘సీఎం వివాహ పథకం’ కింద వధువుకు మంగళసూత్రం, ట్రంకుపెట్టె, దుస్తులతోపాటు రూ.51 నగదు అందించారు. ఈ కానుకలను ఆశపడిన యువతి తనకు మరో వ్యక్తితో ఏడాది క్రితమే పెళ్లైనా మళ్లీ తన సోదరుడిని వివాహం చేసుకుని ప్రభుత్వం అందించే కానుకలను అందుకుంది. అయితే గ్రామస్తులు ఈ విషయాన్ని గ్రహించి ఉపాధి కోసం వేరే ప్రాంతంలో ఉంటున్న ఆమె భర్తకు ఫొటోలతో సహా పంపి సమాచారం అందించారు. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త.. వెంటనే మహారాజ్‌గంజ్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం సీఎంవోకు చేరడంతో ఆగ్రహించిన సీఎం విచారణకు ఆదేశించారు. మరోవైపు లక్ష్మీపుర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.