sexual assault : సాఫ్ట్వేర్ ఇంజనీర్​పై లైంగికదాడి

by Sridhar Babu |
sexual assault : సాఫ్ట్వేర్ ఇంజనీర్​పై లైంగికదాడి
X

దిశ, ఎల్బీనగర్ : సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో పార్టీ ఇస్తానని చెప్పి తన చిన్ననాటి స్నేహితులతో హోటల్​కు వచ్చిన యువతితో పాటు మరో ఇద్దరు మద్యం సేవించి ఆ మత్తులో యువతిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. వనస్థలిపురం పరిధిలోని సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయిన ఒక యువతి హయత్ నగర్ లెక్చలర్ కాలనీ లో ఉంటున్న తన చిన్ననాటి స్నేహితుడైన గౌతం రెడ్డికి పార్టీ ఇస్తానని ఓంకార్ నగర్ పరిధిలో ఉన్నటువంటి బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్ కి వచ్చారు. రెస్టారెంట్లో గౌతమ్ రెడ్డి తోపాటు

సాఫ్ట్వేర్ ఉద్యోగిని పార్టీ చేసుకుంటుండగా ఇదే హోటల్​కు గౌతమ్ రెడ్డి స్నేహితుడు వచ్చాడు. ముగ్గురు మద్యం సేవించి ఆ మత్తులో గౌతమ్ రెడ్డి అతని స్నేహితుడు యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. దీంతో గదిలో అరుపులు కేకలు రావడంతో హోటల్ సిబ్బంది గదిలోకి వెళ్లారు. హోటల్ సిబ్బందిని చూసిన గౌతమ్ రెడ్డి అతని స్నేహితులు పారిపోయారు. ఈ విషయాన్ని హోటల్ నిర్వాహకులు సాఫ్ట్వేర్ దగ్గర ఉన్నటువంటి ఐడీతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఇరువురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Next Story