ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి

by Mahesh |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు.ఈ విషాద సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కనక్రమసత్రం సమీపంలో చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు, లారీ ఢీ కొట్టుకోవడంతో కారులో ఉన్న ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని ఏపీకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌గా పోలీసులు నిర్దారించారు. ఆదివారం సెలవు కావడంతో తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానికలు సహాయంతో బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story