- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టివేత..ముగ్గురు అరెస్ట్, పరారీలో మరొకరు
దిశ,శేరిలింగంపల్లి : ముగ్గురు యువకులకు వస్తున్న ఆదాయం సరిపోవడం లేదని ఒకటికి మూడింతలు లాభాలు గడించాలని పక్క దారిలో నడుస్తున్నారు. డ్రగ్స్ అమ్మకాలు చేస్తూ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో డ్రగ్స్ అమ్ముతున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ డీఎస్పీ తిరుపతి యాదవ్ తమ టీం సభ్యులతో కలిసి బుధవారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో కాపు కాసి డ్రగ్స్ అమ్మకాలకు ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వీరు ఒక్కొక్క ఎల్ఎస్డి బ్లాట్స్ నో రూ. 15 వేలకు ఒకటి చొప్పున అమ్మకాలు జరుపుతుంటారు.
ఈ ముగ్గురి వద్ద 5.77 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ రూ. 83 వేల వరకు ఉంటుందని డీఎస్పీ తిరుపతి యాదవ్ తెలిపారు. డ్రగ్స్ తో పట్టుబడిన వారిలో దత్తి లితిన్, పడాల అభిరామ్ నాయుడు, కొడాలి ఎమార్ట్ ఉన్నారు. వీరిని అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ ను దిగుమతి చేసే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పట్టుకున్న టీం లో డీఎస్పీ తో పాటు సీఐ నాగరాజు, ఎస్సై జ్యోతి, కానిస్టేబుల్ రాజేశ్వర్ వికాస్, శశికిరణ్, కృష్ణారావు ఉన్నారు. డ్రగ్స్ ను పట్టుకున్న డీఎస్పీ తిరుపతి యాదవ్ టీం ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ, అడిషనల్ ఎస్పీ భాస్కర్ అభినందించారు.