పిల్లల కదలికలను కనిపెట్టండి.. తల్లిదండ్రులకు సజ్జనార్ మెసేజ్

by GSrikanth |
పిల్లల కదలికలను కనిపెట్టండి.. తల్లిదండ్రులకు సజ్జనార్ మెసేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. అమీర్‌పేట సోనాబాయి ఆలయం సమీపంలో ఉంటున్న గణేష్‌ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన 9వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. స్నాప్‌చార్ట్‌లో పరిచయం చేసుకొని దారుణానికి పాల్పడ్డాడు. ఆపై ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వీడియోలతో బెదిరించి బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో రెండుసార్లు అత్యాచారం చేశాడు. ఈ మేరకు నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తాజాగా.. ఈ ఇన్సిడెంట్‌పై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘తల్లిదండ్రులు బిజీ లైఫ్‌ను కాస్త పక్కన పెట్టండి. పిల్లలపై శ్రద్ధ తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. నిత్యం వారి కదలికలను కనిపెట్టాలి. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం ఇస్తున్నారా?.. అనేది తప్పకుండా తెలుసుకోవాలి. జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన పెంచాలి’ అని సూచించారు.

Advertisement

Next Story