Robbery Gang: నగరంలో అర్ధరాత్రి రాబరీ గ్యాంగ్ హల్‌చల్.. కారు దొంగిలించి ర్యాష్ డ్రైవింగ్

by Shiva |
Robbery Gang: నగరంలో అర్ధరాత్రి రాబరీ గ్యాంగ్ హల్‌చల్.. కారు దొంగిలించి ర్యాష్ డ్రైవింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: అర్ధరాత్రి రాబరీ గ్యాంగ్ బీభత్సం సృష్టించిన భయానక ఘటన వనస్థలిపురం పరిధిలోని ఇంజాపూర్ సాగర్ హైవే‌పై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుర్రంగూడ నుంచి ఇంజాపూర్ వైపు ఓ వ్యక్తి కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే కాపు కాసిన ఓ రాబరీ గ్యాంగ్ ఆ వ్యక్తిని అడ్డుకుని దాడి చేసి కారుతో అక్కడి నుంచి ఉడాయించారు. కాసేపటి తరువాత అదే రహదారిపై ర్యాష్ డ్రైవింగ్ చూస్తూ రోడ్డు వెంట వెళ్తున్న వారిని ఢీకొట్టుకుంటూ పారిపోయేందుకు యత్నించారు. గమనించిన స్థానికులు ఓ అంబులెన్స్‌లో వెళ్లి చేజ్ చేసి కారుతో పాటు రాబరీ గ్యాంగ్‌లో ఇద్దరిని పట్టుకున్నారు. ఈ మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మిగతా నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Advertisement

Next Story