Road Accident: పులివెందులలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 12 మందికి గాయాలు

by Shiva |
Road Accident: పులివెందులలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 12 మందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా పులివెందులలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పులివెందుల- కదిరి రహదారిపై ఓ గుర్తు తెలియని వాహనం ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆటో ఉన్న మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో సమీపంలో ఏరియా ప్రభుత్వాసుపత్రి తరలించారు. కూలి పని కోసం పులివెందుల వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ప్రమాదానికి గురైన వారంతా సత్యసాయి జిల్లా బట్రేపల్లె వాసులుగా గుర్తించారు.

Advertisement

Next Story