మైనర్ బాలికపై అత్యాచారం..ఆపై సోషల్ మీడియాలో వీడియో పోస్ట్: యూపీలో దారుణ ఘటన

by samatah |
మైనర్ బాలికపై అత్యాచారం..ఆపై సోషల్ మీడియాలో వీడియో పోస్ట్: యూపీలో దారుణ ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. మైనర్ బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముజఫర్ నగర్‌కు చెందిన వసీం ఈ నెల16న ఓ 16ఏళ్ల బాలికను చెరుకుతోటలోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాగే ఘటనను మొత్తం వీడియో తీశాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే ఆ వీడియోను బయటపెడతానని బెదిరింపులకు గురి చేశాడు. నిందితుడి హెచ్చరికలకు బయపడిన బాలిక ఈ సంఘటన గురించి ఎవరికీ చెప్పలేదు. ఈ క్రమంలోనే వసీం మంగళవారం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ విషయం బాలిక తల్లి దండ్రుల దృష్టికి వెళ్లగా..వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

Advertisement

Next Story