HYD: చర్లపల్లి జైలులో షాకింగ్ ఇన్సిడెంట్.. డ్రగ్స్ కోసం ఖైదీల ఆందోళన

by GSrikanth |
HYD: చర్లపల్లి జైలులో షాకింగ్ ఇన్సిడెంట్.. డ్రగ్స్ కోసం ఖైదీల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ విక్రయాలు భారీగా పెరిగాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ డ్రగ్స్ బారినపడుతున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా రోజూ ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. డ్రగ్స్ మూలంగా అనేక దారుణాలూ జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్ కోసం ఏకంగా విచారణ ఖైదీలు ఆందోళన చేయడం కలకలం రేపుతోంది. డ్రగ్స్‌కు అలవాటు పడిన ఖైదీలు శనివారం ఉదయం సిబ్బందిపై తిరగబడ్డారు. జైలు ఉన్నతాధికారులు అప్రమత్తమై నలుగురు ఖైదీలను అదుపులోకి తీసుకొని ప్రత్యేక బ్యారేర్‌లోకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story