- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: భుజంగరావు, తిరుపతన్నకు రిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాంపింగ్ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు కోర్టు రిమాండ్ విధించింది. మంగళవారం వారిద్దరి కస్టడీ ముగియడంతో పోలీసులు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు ఏప్రిల్ 6వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే తిరుపతన్న, భుజంగరావు నుంచి కీలక అంశాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు, రాధా కిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తిరుపతన్న, భుజంగరావును అధికారులు ప్రశ్నిస్తున్నారు. భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన ఆధారాలతో మరికొంతమందిని దర్యాప్తు బృందం విచారించనుంది. SIB మాజీ డైరెక్టర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డట్టు తిరుపతన్న, భుజంగరావు స్పష్టం చేశారు.