Accident : లారీ ఢీ కొని ఒకరు మృతి

by Sridhar Babu |
Accident : లారీ ఢీ కొని ఒకరు మృతి
X

దిశ, శేరిలింగంపల్లి : లారీ ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన ఆదివారం ఉదయం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున ప్రవీణ్, స్వామీశంకర్ ఇద్దరూ కేపీహెచ్ బీ నుండి మాదాపూర్ వైపు వెళ్తున్నారు.

ఈ క్రమంలో యశోద ఆస్పత్రి సమీపంలోకి రాగానే వారు వెళ్తున్న బైక్ అదుపుతప్పి లారీని ఢీ కొట్టారు. దీంతో వెనక కూర్చున్న స్వామీశంకర్ ఎగిరి లారీ వెనక టైర్ల కింద పడి తలపగిలి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన ప్రవీణ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా బైకు నడిపిన ప్రవీణ్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story