- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూ ఇయర్ ఎఫెక్ట్: గంజాయి అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: గంజాయి అమ్ముతున్న ఇద్దరిని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఉస్మానియా వర్సిటీ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ శ్రీబాల తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట బొడ్రాయి బజార్‌కు చెందిన సాయి నవీన్, వంశీ స్నేహితులు. తేలికగా డబ్బు సంపాదించేందుకు ఇద్దరు కలిసి కొంతకాలంగా బొడ్రాయి బజార్‌కే చెందిన వంశీ అనే వ్యక్తి నుంచి 3 వేల రూపాయలకు కిలో చొప్పున గంజాయి కొని వెయ్యి రూపాయలకు వంద గ్రాముల చొప్పున హైదరాబాద్‌లో అమ్ముతున్నారు.
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌లో అమ్మటానికి 2.6 కిలోల గంజాయి తీసుకొచ్చారు. హబ్సిగూడ ప్రాంతంలో గంజాయి అమ్మటానికి ప్రయత్నిస్తుండగా పక్కాగా సమాచారం సేకరించిన టాస్క్ ఫోర్స్ సీఐ సైదాబాబు, ఎస్ఐ అనంతచారి, కానిస్టేబుల్ రాకేష్‌తో కలిసి అదనపు డీసీపీ నర్సింహా రావు పర్యవేక్షణలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇంతకు ముందు సాయి నవీన్ గంజాయి అమ్ముతూ సూర్యాపేట టౌన్, మోతె పోలీసులతోపాటు ఖమ్మం ఎక్స్సైజ్ పోలీసులకు పట్టుబడినట్టు డీసీపీ శ్రీబాల తెలిపారు. ఇక, వంశీ గంజాయి అమ్ముతూ మోతె పోలీసులకు దొరికాడని చెప్పారు.