Marijuana : భారీగా గంజాయి పట్టివేత

by Sridhar Babu |
Marijuana : భారీగా గంజాయి పట్టివేత
X

దిశ, తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గోపాలగిరి క్రాస్ రోడ్డు వద్ద విశ్వనీయ సమాచారం మేరకు 60 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కెకన్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం తొర్రూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం తొర్రూరు పోలీసులు గోపలగిరి క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులు

ఒడిశాకు చెందిన ప్రహల్లాద్ సిసా, అపన్న బైరాగి, బసంతి పాంగి, సీతామాసిసా ఓ వాహనంలో సుమారుగా 60 కిలోల ఎండు గంజాయిని ఆంధ్రప్రదేశ్ సీలేరు ప్రాంతం నుండి తెలంగాణకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్టు తెలిపారు. ఈ గంజాయి విలువ 12 లక్షలు ఉంటుందని తెలిపారు. 4 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గంజాయి ముఠాను పట్టుకున్న తొర్రూర్ పోలీసులను అభినందిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ సీఐ సంజీవ, ఎస్ఐలు జగదీష్, సతీష్, రాజు క్రాంతి కిరణ్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story