Accident : ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి..

by Sumithra |
Accident : ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి..
X

దిశ, చౌటకూర్ : మండలం కేంద్రంలోని చౌటాకుర్ గ్రామ శివారులోని 161 జాతీయ రహదారి పై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని కోమటికుంట తండాకు చెందిన మాజీ ఉపసర్పంచ్ డేగావత్ శంకర్ (45) సంగారెడ్డి నుంచి తిరుగు ప్రయాణంలో చౌటకూర్ గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు.

దీంతో బాధితుని తలకు తీవ్ర గాయాలు కాగా విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కొరకు ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లుగా స్థానికులు తెలిపారు. మృతుడు సంగారెడ్డిలో లేబర్ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడని తెలిపారు. పుల్కల్ ఎస్సై క్రాంతి కుమార్ కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story