scam on WhatsApp: రెచ్చిపోతున్న కేటుగాళ్ళు.. వాట్సప్‌లో సరికొత్త మోసం..

by Disha Web Desk 3 |
scam on WhatsApp: రెచ్చిపోతున్న కేటుగాళ్ళు.. వాట్సప్‌లో సరికొత్త మోసం..
X

దిశ వెబ్ డెస్క్: కష్టపడకుండానే భారీ మొత్తంలో డబ్బులు రావాలి, అంటే మోసాలకు పాల్పడాలి అని అనుకుంటూ కొందరు కేటుగాళ్ళు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అయుతే ఇప్పటి వరకు వాట్సప్‌ ఖాతాదారుల డేటాను సేకరించి, డేటా సంబంధిత ఖాతాదారులను బెదిరించి నగదు వసూలు చేయడం, అలానే ఎదో ఒక లింక్‌ను వినియోగదారులకు పంపించి, వినియోగదారులు ఆ లింక్ క్లిక్ చేసేలా ప్రలోభాలకు గురిచేసి, వాళ్లు ఆ లింక్‌ను క్లిక్ చేయగానే వాళ్ల బ్యా్ంక్ అకౌంట్‌లోని డబ్బులను కాజేయడం చూసాము.

అయితే ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. జస్ట్ ఒక కాల్ చేసి వినియోగదారులను నిలువునా ముంచుతున్నారు. ఇలా వాట్సప్‌ కాల్‌తో కేటుగాళ్ళు సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘటనలు తాజాగా UKలో చోటు చేసేకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. తాము సైబర్ మోసాలకు గురైనట్టు UKలోని సైబర్ క్రైమ్ పోలీసులకు వందల కొద్దీ ఫిర్యాదులు అంధాయి.

UK సైబర్ క్రైమ్ పోలీసుల సమాచారం ప్రకారం.. కాగా మోసం చేయడంలో ఆరితేరిన కేటుగాళ్ళు వాట్సప్‌ గ్రూప్ చాట్‌లో ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ముందుగా ఫేక్ ఫ్రొఫైల్ ఫోటోతో, డిసిప్లే పేరుతో అకౌంటు క్రియేట్ చేసుకుంటారు. అనంతరం వాట్సప్‌ వినియోగదారులకు కాల్ చేసి వాళ్లను ప్రలోభాలకు గురిచేసి తమ వాట్సప్‌ గ్రూప్‌ వీడియో కాల్‌లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతారు.

ఈ నేపథ్యంలో కేటుగాళ్ల మాటలు నమ్మి వాట్సప్‌ గ్రూప్‌‌ కాల్‌లోజాయిన్ అయ్యేందుకు సిద్దపడతారు. ఈ నేపథ్యంలో మీ నెంబర్‌కి OTP వచ్చిందని, ఆ OTP చెప్తే వీడియో కాల్‌లో జాయిన్ చేస్తామని చెప్తారు. ఇక వాట్సప్‌ వినియోగదారులు OTP చెప్పిన వెంటనే కేటుగాళ్లు వేరే సైట్‌లో వినియోగదారుల వాట్సప్‌‌ను ఓపెన్ చేసి, ఆ వాట్సప్‌‌లో ఉన్న వినియోగదారుల ఫ్రెండ్స్‌కి, కుటుబసభ్యులకు తనకి అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని వెంటనే పంపమని మెసేజ్‌లు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. కనుక తెలియని నెంబర్ నుండి వచ్చే కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని UK సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.

Next Story

Most Viewed