గురుకులంలో సీటు ఇప్పిస్తామని రూ.35 వేలకు కుచ్చుటోపీ

by Sridhar Babu |
గురుకులంలో సీటు ఇప్పిస్తామని రూ.35 వేలకు కుచ్చుటోపీ
X

దిశ, మేడిపల్లి : గురుకులంలో సీటు ఇప్పిస్తామని రూ.35 వేలకు కుచ్చుటోపీ పెట్టిన ఉదంతం ఇది. చందుర్తి మండలం కిష్టంపేటలో ఉండే తన మిత్రుడికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బాగా తెలుసని, నీ కుమారుడికి గురుకులంలో సీటు ఇప్పిస్తామని చెప్పి రాజలింగంపేట గ్రామానికి చెందిన రేగుల రాజేందర్ అనే వ్యక్తి రత్నాల పల్లెకు చెందిన ఓ మహిళ వద్ద రూ. 35 వేలు తీసుకున్నట్లు బాధితులు మేడిపెల్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి అందుకు సంబంధించిన వివరాలు ఎస్సై శ్యామ్ రాజ్ వెల్లడించారు. రాజలింగంపేట్ గ్రామానికి చెందిన

రేగుల రాజేందర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఒక మహిళ వద్ద ఆమె కుమారుడికి వేములవాడలోని గురుకుల పాఠశాలలో సీటు ఇప్పిస్తానని, తమకు చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన చిగురుల మల్లేశం అనే వ్యక్తి బాగా తెలుసునని, అతనికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలుసని చెప్పి 35 వేల రూపాయలు తీసుకున్నారన్నారు. సదరు మహిళ కుమారుడికి వేములవాడ గురుకులంలో ఫ్రీ సీటు వచ్చిందని తెలుసుకున్న వీరు ఇద్దరు ఎమ్మెల్యే పేరు తప్పుగా వాడుకొని తన వద్ద నుండి 35 వేల రూపాయలు తీసుకొని మోసం చేశారని తెలుసుకొని మహిళ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్సై శ్యామ్ రాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story