- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kidney Racket: జాబ్ ఇప్పిస్తామని కిడ్నీలు కాజేశారు
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో కిడ్నీ రాకెట్ యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కిడ్నీలు కాజేసిన ఘటన వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు బాధితుల కథనం మేరకు ఢిల్లీ పోలీసులు (Delhi Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతమంది సిండికేట్‌గా ఏర్పడి ఈ కిడ్నీ రాకెట్ (Kidney Racket)ను నడిపిస్తున్నారు. ఎవరైనా డబ్బున్న వాళ్లు కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటే వారిని గురించి సిండికేట్ సభ్యులు వారిని సంప్రదిస్తారు. కిడ్నీ అందిస్తామని వారి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంటారు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో ఉన్న తమ సిండికేట్ సభ్యులతో అక్కడ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉద్యోగం కోసం వెతుకుతున్న వారిని టార్గెట్ చేసి.. ఉద్యోగం పేరుతో భారత్‌కు రప్పిస్తారు. అలా వచ్చిన తర్వాత వారికి మత్తు మందిచ్చి కిడ్నీ కాజేసి కొంత మొత్తం డబ్బులిచ్చి తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించేస్తారు. తాజాగా ఓ ముగ్గురు బాధితులు ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో ఈ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది.
వారిలో 30 ఏళ్ల ఓ బాధితుడి కథనం ప్రకారం.. బంగ్లాదేశ్ (Bangladesh)లో అతడికి ఓ బట్టల దుకాణం ఉండేది. అయితే అగ్ని ప్రమాదంలో దుకాణం కాలిపోవడంతో ఓ ఎన్‌జీవో నుంచి 8 లక్షలు టకాలు(బంగ్లాదేశీ కరెన్సీ) లోన్ తీసుకున్నాడు. అందులో 3 లక్షలు తిరిగి చెల్లించాడు కానీ, మిగిలిన 5 లక్షలు చెల్లించడం కష్టమైంది. దీంతో మిగిలిన డబ్బు కోసం ఇబ్బంది పడుతుండగా ఓ స్నేహితుడు భారత్‌లో ఉద్యోగం దొరుకుతుందని చెప్పి పాస్‌పోర్ట్, వీసా, అన్నీ రెడీ చేసి భారత్ పంపించాడు. అయితే భారత్ చేరుకున్న తర్వాత అతడిని కొంతమంది తీసుకెళ్లి ఓ హోటల్ రూంలో పెట్టారు. ఉద్యోగం కోసం ప్రశ్నిస్తే.. ఇండియాలో జాబ్‌లు లేవని, అందుకే కిడ్నీ ఇస్తే దానికి తగిన డబ్బులు ఇస్తామని చెప్పారు. తాను ఒప్పుకోకపోవడంతో పాస్‌పోర్ట్ (పాస్పోర్ట్), వీసా (Visa) తమ దగ్గరపెట్టుకుని బెదిరించారు. ఇక చేసేదేం లేక కిడ్నీ ఇచ్చేశాను. దానికి 4 లక్షల టకాలు ఇచ్చి నన్ను తిరిగి బంగ్లాదేశ్ పంపించేశారు.
35 ఏళ్ల మరో బాధితుడి కథనం ప్రకారం.. సదరు బాధితుడు బంగ్లాదేశ్‌లో ఉండే టస్కిన్ అనే వ్యక్తి ద్వారా భారత్‌లో ఉద్యోగం కోసం వచ్చాడు. ఎయిర్‌పోర్ట్ (Airport) దగ్గరే రసేల్, మహమ్మద్ రకొన్ అనే ఇద్దరు తనని తీసుకెళ్లి ఓ హోటల్లో ఉంచారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్‌ల పేరుతో రకరకాల టెస్ట్‌లు చేసి మత్తుమందిచ్చారు. రెండు రోజుల తర్వాత మెలకువ రాగా.. నా పొత్తి కడుపు వద్ద ఆపరేషన్ చేసి కుట్లు వేసినట్లు ఉంది. భయంతో ఇదేంటని వాళ్లని నిలదీస్తే.. ‘కిడ్నీ తీసుకున్నాం. సైలెంట్‌గా బంగ్లాదేశ్ వెళ్లిపో. లేదంటే ఇక్కడే చంపేస్తాం’ అని బెదిరించి 4 లక్షల టకాలు బ్యాంక్ అకౌంట్లో జమ చేసి తిరిగి బంగ్లాదేశ్ పంపించేశారని చెప్పాడు.
ఇక మూడో బాధితుడి కథనం కూడా ఇంచుమించు ఇలానే ఉంది. ఉద్యోగం కోసం భారత్ తీసుకొచ్చి మత్తిచ్చి కిడ్నీ కాజేశారు. మరుసటి మెలకువ రాగా.. తన కిడ్నీ దొంగిలించినట్లు తెలిసి భయపడిపోయాడు. వారిని నిలదీస్తే 4.5 లక్షల టకాలు అకౌంట్లో వేసి సైలెంట్‌గా ఇంటికి వెళ్లమని బెదిరించారని వాపోయాడు. ప్రస్తుతం ఈ ముగ్గురూ బంగ్లాదేశ్ చేరుకోగా.. అక్కడి పోలీసులతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.