భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త..ఆపై తల్లికి వీడియో కాల్: కెనడాలో భారతీయ వ్యక్తి ఘాతుకం

by samatah |
భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త..ఆపై తల్లికి వీడియో కాల్: కెనడాలో భారతీయ వ్యక్తి ఘాతుకం
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలో భారతీయ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన భార్యను కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే..పంజాబ్‌కు చెందిన జగ్‌ప్రీత్ కౌర్ ఆయన భార్య బల్వీందర్ కౌర్(41)లు వారం రోజుల క్రితం కెనడాకు వెళ్లారు. జగ్‌ప్రీత్ నిరుద్యోగి కావడంతో ఆర్థిక విషయాల్లో దంపతుల మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ క్రమంలోనే మార్చి 15న అర్ధరాత్రి భార్యను జగ్‌ప్రీత్‌కౌర్ కత్తితో పొడిచి చంపాడు. అనంతరం తన తల్లికి వీడియో కాల్ చేసి మృత దేహాన్ని చూపెట్టి సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, బల్వీంధర్, జగప్రీత్ కౌర్‌లకు 2000 సంవత్సరంలో వివాహమైంది. వారికి కుమార్తె హర్నూర్‌ప్రీత్ కౌర్, కుమారుడు గుర్నూర్ సింగ్ ఉన్నారు. జగప్రీత్ కౌర్‌కు చెందిన కుటుంబ సభ్యులు కూడా కెనడాలోనే ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story