భార్యను 224 ముక్కలుగా నరికిన భర్త: బ్రిటన్‌లో దారుణం

by samatah |
భార్యను 224 ముక్కలుగా నరికిన భర్త: బ్రిటన్‌లో దారుణం
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి అనంతరం ఆమె శరీరాన్ని 224 ముక్కలుగా నరికాడు. అనంతరం వాటిని ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి నదిలో పడేశాడు. హత్య జరిగిన ఏడాది తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇంగ్లండ్‌లోని లింకన్ నగరానికి చెందిన నికోలస్ మెట్సన్ అనే వ్యక్తి తన భార్య హోలీ బ్రెమ్లీ (26)ని గతేడాది మార్చిలో తన ఇంట్లోనే కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం ఆమె మృత దేహాన్ని 224 ముక్కలు చేశాడు. కొద్ది రోజులు వాటిని ఇంట్లోనే ఉంచి..ఆ తర్వాత తన స్నేహితుడైన జాషువా హాన్‌కాక్ సాయంతో వాటిని లింకన్ నగరానికి సమీపంలోని వితం నదిలో పడేశాడు. శరీర భాగాలను గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బ్రెమ్లీ ఇంటికి వెళ్లి పరిశీలించగా అనుమానం రావడంతో ఆమె భర్త నికోలస్ మెట్సన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ఈ హత్యను తాను మొదట నిరాకరించగా తాజాగా నేరాన్ని అంగీకరించాడు. అయితే హత్యకు గల కారణాన్ని వెల్లడించలేదు. అయితే నిందితుడు గతంలోనూ తమ మాజీ భార్యలపై దారుణాలకు తెగబడ్డట్టు తెలుస్తోంది. ఇందుకు గాను 2013, 2016, 2017లో దోషిగా తేలాడు.

Advertisement

Next Story