షర్మిలకు ఏడాది కొడుకు.. మామ ఫిర్యాదుతో కేసు నమోదు!

by Nagaya |
షర్మిలకు ఏడాది కొడుకు.. మామ ఫిర్యాదుతో కేసు నమోదు!
X

దిశ, వెబ్‌డెస్క్ : మనువాడిన వాడు పక్కన ఉన్నా మనసిచ్చిన వాడి కోసం పరితపిస్తున్నారు కొందరు మహిళలు. అగ్నిసాక్షిగా పెళ్లాడి సంసారం చేస్తున్నా.. అతడిని కాదనుకుని అక్రమ సంబంధాల కోసం వెంపర్లాడుతున్నారు. ఎదిగివస్తున్న పిల్లలు ఉన్నా క్షణిక సుఖం కోసం పండండి సంసారాలను పాడు చేసుకుంటున్నారు. తాజాగా ఏపీకి చెందిన ఓ మహిళ పెళ్లికి ముందు ఉన్న అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ భర్త మరణానికి కారణమైంది. ఒక్కగానొక్క కొడుకుని అనాథని చేసింది. కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రంలోని బోడరహళ్లికి చెందిన చంద్రశేఖర్‌(28)కు పావనగడ తాలూక గుమ్మఘట్ట గ్రామానికి చెందిన షర్మిల(25)తో ఏడాదిన్నర క్రితం వివాహం అయింది. వారికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. షర్మిలకు పెళ్లికాక ముందే సోమం దేవులపల్లి మండలం, క్యాతగానచెర్లు గ్రామానికి చెందిన యువకుడితో అక్రమ సంబంధం ఉంది. షర్మిలకు వివాహం అయినా ఆ యువకుడిని మర్చిపోలేకపోయింది. ఈ క్రమంలో తరచూ ఏదో ఓ కారణం చెబుతూ పుట్టింటికి వచ్చి ప్రియుడి దగ్గరికి వెళ్లేది. బాబు జన్మించినా ఆమె పద్ధతిలో ఎలాంటి మార్పురాలేదు. భర్త ఎంత చెప్పినా వినకుండా పదేపదే పుట్టింటికి వెళ్లేది.

అయితే షర్మిల ప్రవర్తనపై అనుమానం వచ్చిన చంద్రశేఖర్.. ఆమె గురించి అత్తగారి ఊర్లో ఎంక్వైరీ చేశాడు. దీంతో ఆమె గుట్టు మొత్తం బయటపడింది. పుట్టింటి పేరుతో ఆమె తన ప్రియుడిని కలుస్తూ రాసలీలలు సాగిస్తుందని తెలుసుకోని భర్త కుమిలిపోయాడు. భార్య ప్రవర్తన నచ్చక మనస్థాపం చెంది ఆమె చీరతోనే ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం మృతుడి తండ్రి రామాంజినప్ప కోడలు షర్మిలతోపాటు, ఆమె సోదరిపై పావనగడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.

Advertisement

Next Story