రాష్ట్ర రాజధానిలో డ్రగ్స్ కలకలం.. రూ.70 కోట్ల మత్తు పదార్థాలు సీజ్

by Satheesh |
రాష్ట్ర రాజధానిలో డ్రగ్స్ కలకలం.. రూ.70 కోట్ల మత్తు పదార్థాలు సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజధాని చెన్నైలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.70 కోట్ల విలువైన 7 కిలోల డ్రగ్స్‌ను అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. కెలంబాక్కంలో 6 కిలోలు, రెడ్ హిల్స్‌లో ఒక కిలో మత్తు పదార్థాలను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోన్న ముగ్గురు పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వీరి వెనుక ఉన్న నెట్ వర్క్‌పై ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Next Story