- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:నకిలీ కరెన్సీ నోట్ల ముఠా అరెస్ట్
దిశ, ఏలూరు: జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో దొంగ నోట్లు (చిల్డ్రన్స్ కరెన్సీ) మార్పిడికి పాల్పడుతున్న ఐదుగురు ఘరానా మోసగాళ్ల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర తన కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై జంగారెడ్డిగూడెం సీఐ వి.కృష్ణ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ షేక్ జబ్బీర్ సిబ్బందితో కలిసి జంగారెడ్డిగూడెం పరిసర ప్రజలకు అసలు కరెన్సీ నోట్లకు బదులుగా మూడు రెట్లు ఎక్కువ దొంగ నోట్లు ఇస్తామని ఆశ చూపి, మోసాలకు పాల్పడుతున్న ముఠా ను జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ సమీపంలో బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నామన్నారు.
ఈ క్రమంలో వారిని తనిఖీ చేయగా 40 వేల రూపాయల అసలు కరెన్సీ, 500 రూపాయల డినామినేషన్‌లో రెండున్నర లక్షల నకిలీ నోట్లు, ఒక కారు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులు బర్రె సుధీర్, చెట్ల నాగరాజు, నెడుసు గంగాధర్ , ఏలేటి చంద్రశేఖర్ , భోగిరాల బాలులను అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ తెలిపారు. ప్రజలు దొంగ నోట్ల ముఠా పట్ల అవగాహన కలిగి ఉండాలని, లోన్ యాప్‌ల జోలికి వెళ్ళవద్దని కోరారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉన్నయెడల దగ్గర్లో ఉన్న పోలీసు వారిని సంప్రదించాలని, మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడానికి పోలీసులు వారికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిందితులను అరెస్ట్ చేయడానికి సహకరించిన పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ పిసిహెచ్ శ్రీనివాస రెడ్డి కానిస్టేబుళ్ళు చవల సత్యనారాయణ, ఉప్పులూరి రవికుమార్ కానిస్టేబుల్ లను అభినందించారు.