- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నలుగురు ద్విచక్ర వాహనాల దొంగలు రిమాండ్
దిశ, కూకట్పల్లి : ద్విచక్ర వాహనాల దొంగలు నలుగురిని అల్లాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రినగర్ కూడలిలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా రెండు బైకులపై నలుగురు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద ఉన్న వాహనాలు చోరీ చేసినట్టు గుర్తించారు. వారిని పోలీసులు విచారించగా కేపీహెచ్‌బీ పీఎస్లో 1, ఫిలింనగర్ పీఎస్లో 1, బాచుపల్లి పీఎస్లో 1, మియాపూర్ పీఎస్లో 1, మాధాపూర్ పీఎస్లో 1,
అల్లాపూర్ పీఎస్లో 1, గచ్చిబౌలిలో పీఎస్లో 6, చందానగర్ పీఎస్ పరిధిలో 2 మొత్తం 14 ద్విచక్ర వాహనాలను నలుగురు చోరీ చేసినట్టు నేరం అంగీకరించినట్టు సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, నిందితులు నానాక్రామ్గూడకు చెందిన చప్పిడి గణేష్, బాచుపల్లికి చెందిన గుబ్బల పవన్ కుమార్, మోతీనగర్‌కు చెందిన గుబ్బల శ్రీరామ్, ఒక మైనర్ బాలుడు ఉన్నారని తెలిపారు. జల్సాలకు అలవాటు పడిన నిందితులు రాత్రుళ్లు తిరుగుతూ ఇండ్ల ముందు పార్క్ చేసిన వాహనాలను చోరీ చేసి వాటిని తక్కువ ధరకు అమ్మేందుకు అన్ని వాహనాలను ఒక చోట దాచి ఉంచారని సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.
- Tags
- crime