- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్
దిశ,కార్వాన్ : గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి పోలీసులు 1.20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దూల్పేట్ లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ దూల్పేట్ లో భాగంగా గురువారం రాత్రి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులు జాయింట్ కమిషనర్లు కురేసి శాస్త్రి , అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో 70 మంది పోలీసులతో పది టీములుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్వయంగా ఉన్నతాధికారులు గల్లీగల్లీ తిరిగి సోదాలు చేపట్టగా,
మరోపక్క ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో హజారి హోటల్ మాగ్రా గంగా బోలి ప్రాంతాల్లో దాడులు నిర్వహించి దిలావర్గం ప్రాంతంలో గంజాయి అమ్ముతుండగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని 1.20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు ఆగస్టు 31 వరకు కొనసాగుతాయని , దూల్పేట్ గంజాయి లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. గంజాయి నివారణకు ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతు అందించాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి ఈ సందర్భంగా దూల్ పేట్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- Tags
- ganja